సింగపూర్‌లో అన్నమయ్య పాటకు పట్టం - annamayya shata galarchana
సింగపూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య శత గళార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది.
తెలుగు భాగవత ప్రచార సమితి సంస్థ ఆధ్వర్యంలో... సింగపూర్ లో అన్నమయ్య శత గళార్చన కార్యక్రమం వీనులవిందుగా, శ్రవణానందకరంగా జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణం వేదికగా పెద్ద ఎత్తున కళాకారులతో ఈ భగవదారాధన చేశారు. వంద మంది కోసం నిర్వాహకులు సంకల్పిస్తే.. సుమారు 250 మంది గాయనీ గాయకులు తరలివచ్చి శ్రీనివాసుని అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. పెద్దలు పిల్లలు కలిసి తన్మయత్వంతో సప్తగిరి సంకీర్తనలను ఆలపించారు. సుమారు 50 మంది పిల్లలు స్వామిని కీర్తించడం ఆకట్టుకుంది. దేశ విదేశాల్లోని కళాకారులు ఈ సమారాధనలో పాల్గొన్నారు. నెల నుంచి అభ్యాసం చేశారని నిర్వాహకులు తెలిపారు.