పేరున్న మహిళలకు ఆత్మవిశ్వాసంతోనే నైపుణ్యాలున్నాయనుకుంటామంతా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కోపంగా ఉన్న మహిళలే విజయాలు సాధిస్తారట. వీళ్లకు అతివిశ్వాసం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటుందనేది పరిశోధన. అరవలానిపిస్తే అరిచేయడం...ఏదైనా మోహం మీదే అడిగేయడం వీరికి అలవాటు. ఏదైనా చేయాలనిపిస్తే చేసేయలేనేది వారి నైజం.
ముక్కు మీద కోపం మంచిదే! - angry women
ఆత్మవిశ్వాసం అనే పదం చాలా సార్లు వింటూనే ఉంటాం. అదుంటే ఏదైనా చేయోచ్చనే నమ్మకం. మహిళలకు ఉంటే మరీ మంచిదనే భావన. కానీ ఏదైనా చేయాలనే తపనకు... చేసే పనిలో సామర్థ్యానికి ఆత్మవిశ్వాసం కంటే... కోపమే గొప్పది... మీరు నమ్మకపోయినా ఇదే నిజం. పరిశోధనలు చెబుతున్న మాటాలివి.
ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలకు అంతా తమకే తెలుసు అనే భావన ఉంటుంది. ఏదైనా చేసేందుకు కావాల్సింది ఆత్మవిశ్వాసం...అది ఉందనేది వారి నమ్మకం. ఆత్మవిశ్వాసమనే...పేరుతో ఓ విధమైన భ్రమలో ఉంటారనేది పరిశోధన. లెక్కలు రాడానికి సుత్రాలు పాటించినట్లు వీరు పాటిస్తారు.. అందుకే వీళ్లు చాలా సార్లు అపజయాలతో స్నేహం చేయాల్సి వస్తుంది.
ఎక్కువగా విజయాలతో ముందుకెళ్తుంది మగవాళ్లే. ముక్కుసూటిగా ఉండటమే దీనికి కారణం. ఏదైనా మోహమాటం లేకుండా చెప్పేయడమూ మగవాళ్ల సక్సెస్‌లో ఓ భాగం. ఇప్పుడు మహిళలకు మగళ్లలా ఉండమని సూచిస్తున్నారు పరిశోధకులు. ఆత్మవిశ్వాసమంటూ లోలోపలే... ఆనందపడటం దండగానేది పరిశోధనల సారాంశం.