ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన రోజు నుంచి పోలింగ్ ముగిసే వరకూ జిల్లావ్యాప్తంగా 68 కేసులు నమోదు అయ్యాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి సుమారు 400 మందిని అరెస్టు చేశామని అశోక్ వెల్లడించారు. పోలీసు బలగాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళిక బద్ధంగా పని చేశామన్నారు. ఎన్నికల అనంతరం పలు గ్రామాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయని..ఆ ప్రదేశాల్లో అదనపు బలగాలు మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ వివరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటు చేశామన్న అశోక్ కుమార్... కౌంటింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
ఎన్నికల్లో 68 కేసులు నమోదు.. ఒకరు మృతి: ఎస్పీ
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సారి కేంద్ర బలగాలు తక్కువగా వచ్చినప్పటికీ పోలింగ్ సజావుగా సాగేలా చూశామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ రోజున తాడిపత్రి మండలం వీరాపురంలో చోటు చేసుకున్న ఘటనలో ఒకరి మృతి మినహా... ఇంక ఎక్కడా తీవ్రస్థాయి ఘటనలు జరగలేదన్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్