ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అది నాయకత్వం లేని కూటమి :  అమిత్​ షా - డీఎంకే

ప్రతిపక్షాల కూటమికి నాయకుడే లేడని అమిత్​ షా ఎద్దేవా చేశారు.

మాట్లాడుతున్న అమిత్​షా

By

Published : Feb 14, 2019, 9:43 PM IST

ప్రతిపక్షాల మహాకూటమికి నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​షా. తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన విపక్షాల పొతుపై విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా పటిష్ట నాయకత్వం కలిగి, బలంగా ఉందని స్పష్టం చేశారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిరంగా, పటిష్ఠంగా ఉందని అమిత్​ షా అన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు షా.

మాట్లాడుతున్న అమిత్​షా

దేశంలో రెండు కూటములున్నాయి. అందులో ఒకటి రాహుల్​-విపక్షాలతో ఏర్పాటు చేస్తున్న కూటమి. దానికి నాయకులు లేరు. స్టాలిన్​ ఒకసారేమో రాహులే ప్రధాని అంటారు. మరోసారి ఆ విషయంపై అసలు మాట్లాడరు. ఆయన నిర్ణయమేంటో ఎవరికీ అర్థం కాదు. అది దిశా,నిర్దేశం లేని అవినీతి పరుల కూటమి. మరొకటి ఎన్డీఏ నేతృత్వంలోని అభివృద్ధి కూటమి. డీఎంకే- కాంగ్రెస్​ కూటమి వల్ల తమిళనాడు అభివృద్ధి కోసం కాదు, కేవలం అవినీతి పరులకు మాత్రమే కోసమే.- అమిత్​ షా, భాజపా జాతీయాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details