సైకిల్ దిగిన 'ఆమంచి' - letter
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత బుజ్జగించినా మాటవినలేదు.
తెలుగుదేశం పార్టీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. పార్టీలో కొన్ని శక్తులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపించారు. ఆమంచి గత ఎన్నికల్లో నవోదయం పార్టీ తరఫున గెలుపొందారు. అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరారు. ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న అధ్యక్షుడు చంద్రబాబు... ఆయన్ని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇవేమీ ఫలితాన్నివ్వలేదు. వైకాపాలో చేరేందుకే నిర్ణయించుకున్న ఆమంచి... ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.