ప్రణాళికతోనే రాష్ట్రానికి తక్కువ బలగాలను పంపారన్నారు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అన్ని విధాలా అడ్డుపడ్డారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనంతో ప్రజలు ఓటేశారని అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. వీవీ ప్యాట్‌లో 3 సెకన్లకు మించి గుర్తు కనిపించలేదన్న ఆయన... 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించమంటే ఈసీ ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు.
మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు. ఈవీఎంల నిర్వహణ, ఎన్నికల సంఘం తీరు దారుణమని పేర్కొన్నారు. మహిళలు అర్ధరాత్రి వరకు సహనంతో నిలబడి తెదేపాకు ఓట్లేసి చంద్రబాబు రుణం తీర్చుకున్నారన్నారు. 115 నుంచి 130 సీట్లతో తెదేపా తిరిగి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.