ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అనిశా వలలో.. కొత్తపేట విద్యుత్తు అధికారి - bribe

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట విద్యుత్తు ఉపకేంద్రంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)​గా పనిచేస్తున్న శివశంకర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఏఈ శివశంకర్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అనిశాకు వలలో చిక్కిన కొత్తపేట విద్యుత్తు అధికారి

By

Published : May 7, 2019, 8:01 PM IST

అనిశాకు వలలో చిక్కిన కొత్తపేట విద్యుత్తు అధికారి

తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన ఎడ్డపల్లి భగవాన్‌ అనే రైతు తన పంట పొలంలో బోరుకు విద్యుత్ కనెక్షన్​ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ కనెక్షన్ అనుమతి ఇవ్వాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఏఈ శివశంకర్ రైతును డిమాండ్‌ చేశాడు.


ఈ విషయంపై రైతు భగవాన్‌ రాజమహేంద్రవరం అనిశా అధికారులను సంప్రదించాడు. అవినీతి అధికారిని పట్టుకునేందుకు ఏసీబీ పథకం రచించింది. కొత్తపేట విద్యుత్తు ఉపకేంద్రంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి శివశంకర్​ను పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి శివశంకర్‌ను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు.

ఇవీ చూడండి :ఈసీని కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details