ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అబద్ధాలు బట్టబయలు :అరుణ్​ జైట్లీ - ఆరోపణలు

రఫేల్​ ఒప్పందంపై కాగ్​ నివేదిక వెల్లడించిన నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ.

అబద్ధాలు బట్టబయలు :అరుణ్​ జైట్లీ

By

Published : Feb 13, 2019, 5:49 PM IST

రఫేల్​ ఒప్పందంపై కాగ్​ నివేదికతో మహాకూటమి నేతలు ఇన్నాళ్లుగా చేసిన ఆరోపణలు, దుష్ప్రచారాలు అబద్ధాలని తేలిపోయాయని కేంద్రమంత్రి అరుణ్​ జైట్లీ అన్నారు.

రఫేల్​ ఒప్పందంపై కంప్ట్రోలర్​ అండ్ ఆడిటర్​ జనరల్​(కాగ్​) రాజ్యసభకు నివేదిక సమర్పించింది. యూపీఏ ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందం కన్నా... ఎన్డీయే 2016లో చేసుకున్న ఒప్పందం 2.86శాతం చౌకైందని వెల్లడించింది కాగ్​.

ఈ నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి జైట్లీ. నిజమేంటో మరోసారి దేశానికి తెలిసిందని, సత్యమేవ జయతే అని అన్నారు.

అబద్ధాలు బట్టబయలు :అరుణ్​ జైట్లీ

"కాగ్​ నివేదిక ఎన్డీఏ ప్రభుత్వ విధానాన్ని తేటతెల్లం చేసింది. రఫేల్​పై కాంగ్రెస్​ పార్టీ చేసిన ఆరోపణలు అసత్యాలని తేల్చిచెప్పింది. కాంగ్రెస్​ అధ్యక్షుడు కొన్ని లెక్కలను స్వయంగా సృష్టించారు. 500,1600 అంటూ పోల్చారు. ఆ గణాంకాలు ఏ రికార్డుల్లోనూ లేవు. ఆయనే స్వయంగా తయారు చేసుకున్న గణాంకాలను ఆధారంగా చేసుకొని అనేక సందర్భాల్లో దేశానికి అబద్ధాలు చెప్పారు. సుప్రీంకోర్టే రఫేల్​ ధరలను చూసింది. ప్రక్రియను పరిశీలించింది. అవకతవకలు లేవని తీర్పుచెప్పింది. వివాదం అక్కడే ముగిసిపోయింది."

-అరుణ్​ జైట్లీ, కేంద్రమంత్రి

ABOUT THE AUTHOR

...view details