ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ లోని ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం అరకు విహారయాత్రకు వచ్చి అరకులోయలోని హరిత రిసార్ట్స్ దిగారు. మధ్యాహ్నం భోజనం తర్వాత నాలుగు గంటల సమయంలో కుటుంబ సభ్యులందరూ ఉండగానే ఈ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.
విహారయాత్రలో విషాధం - araku valley
విహారయాత్రకు అరకులోయకు వచ్చి ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్స్‌లో దిగారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం. మధ్యాహ్మం నాలుగు గంటల సమయంలో తల్లిదండ్రులు చూస్తుండగానే బాలుడు ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.
విహారయాత్రలో విషాదం
రక్షణ చర్యలు కొరవడి
ఈ సమయంలో పర్యాటక సిబ్బంది గాని, రిసార్ట్స్ మేనేజ్మెంట్ గాని ఎటువంటి తక్షణ సహాయం అందించలేదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర సహాయక సిబ్బంది లేరు. తండ్రి చూస్తుండగానే కొడుకు చనిపోవడం...ఆ కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు తీవ్రవిషాధంలో మునిగిపోయారు.