ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

1993 ముంబయి పేలుళ్ల నిందితుడు అరెస్టు - వరుస పేళ్లులు

1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అబు బకర్​ను దుబయ్​లో అరెస్టు చేశారు.

ముంబయి వరుస బాంబు పేలుళ్లు

By

Published : Feb 14, 2019, 5:41 PM IST

1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో కీలక ముందడగు పడింది. కుట్రలో ప్రధాన నిందితుడు అబు బకర్​ని ఆపరేషన్​ ద్వారా దుబయ్​లో అదుపులోకి తీసుకుంది భారత నిఘా బృందం. భారత్​కు ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఎవరీ అబు బకర్​?

1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అబు బకర్​. ఘటన అనంతరం దేశం విడిచి పారిపోయాడు​. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీరు​లో పేలుడు పదార్థాలపై శిక్షణ తీసుకున్నాడు. ఆర్​డీఎక్స్, ఇతర పేలుడు సామాగ్రిని అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం సమకూర్చాడు. ముంబయి చేరుకొని మరో నిందితుడు ఫిరోజ్​తో కలసి విధ్వంసకాండ సృష్టించాడు అబు బకర్​.

వీరిద్దరికి ఎలా పరిచయం?

ఫిరోజ్​, అబు బకర్​కి ముంబయి పేలుళ్లకు నాలుగేళ్లకు ముందే అంటే 1989లోనే పరిచయం ఏర్పడింది. వీరు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వీసీఆర్​ లాంటి వస్తువులు అక్రమమార్గంలో కొనుగోలు చేసి వాటిని దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయించేవారు. 1993 పేలుళ్ల గురించిన పూర్తి సమాచారం ఫిరోజ్​కు ముందుగానే తెలుసు.

ఘటన జరిగి ఐదేళ్లయింది...న్యాయం జరిగిందా...?

ముంబయి వరుస పేలుళ్లు జరిగి 25 సంవత్సరాలు దాటిపోయింది. దారుణమైన ఉగ్ర మూక కుట్రకు 257 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సూత్రధారి అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం, అతని అనుచరులేనని కోర్టు తేల్చింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

⦁ 1995లో దావూద్​ ఇబ్రహీం పై రెడ్​ కార్నర్​ నోటిసు జారీ.

⦁ 2007లో టాడా కోర్టు 100 మందిని దోషులుగా గుర్తించింది. తరువాత 23 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.

⦁ 2017లో కీలక నిందితులు అబుసలేం, ముస్తఫా దోసాలకు శిక్ష విధించింది.

ఘటనపై విచారణ జరిగిందిలా..

1. మార్చి 12,1993 : ముంబయిలో 12చోట్ల బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి, 700 మందికి గాయాలు.

2. ఏప్రిల్​ 19,1993 : బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​ అరెస్టు

3. నవంబర్​ 4,1993 : 189 మందిపై 10 వేల పేజీల ఛార్జి షీట్​ దాఖలు

4. నవంబర్​ 19,1993 : సీబీఐకి కేసు బదిలీ

5. మార్చి 20,2003 : నిందితుల్లో ఒకడు ముస్తఫా దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు.

6. నవంబర్​ 11,2005 : అబుసలేంను ఇండియాకు తీసుకొచ్చిన సీబీఐ.

7. జులై 30,2015 : కేసులో కీలక నిందితుడు యాకూబ్​ మెమన్​కు ఉరి.

8. ఫిబ్రవరి 13,2019: కుట్రలో సూత్రధారి, కీలక నిందితుడు అబు బకర్​ దుబయ్​లో అరెస్టు.

ABOUT THE AUTHOR

...view details