'175 ఎకరాలపై వెనకడుగు లేదు' - SUMAN
జవాన్లకు 175 ఎకరాలు విరాళంగా ఇస్తానని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడే ఉన్నా. ఈ విషయంలో వెనకడుగు లేదు. ఈ భూములపై కోర్టు కేసులున్నందున ఆలస్యమవుతోంది: సుమన్, సినీనటుడు
తెలంగాణ... యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని 175 ఎకరాల భూమిని దేశ రక్షణ కోసం శ్రమిస్తోన్న జవాన్లకే కేటాయించినట్లు ప్రముఖ సినీనటుడు సుమన్ వెల్లడించారు. గతంలో తాను చేసిన ప్రకటనకు... ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల ఆ భూములపై కోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపిన సుమన్.... సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటానని తెలిపారు. గత కొన్ని రోజులుగా సామాజిక మాద్యమాల్లో ఈ భూములపై విస్తృత ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో సుమన్ స్పందించారు. ధర ఎంత పెరిగినా మనస్ఫూర్తిగా ఆ భూములను జవాన్ల కోసమే కేటాయిస్తున్నట్లు మరోమారు వెల్లడించారు.