'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలోని మెట్రో ఛానల్ వద్ద ధర్నా ప్రారంభించారు. దీన్ని ఆమె 'సత్యాగ్రహం'గా అభివర్ణించారు. ఈ ధర్నాలో పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మమత సత్యాగ్రహం ప్రారంభం - సత్యాగ్రహం
పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెట్రో ఛానల్ వద్ద "ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం" ధర్నా చేపట్టారు. దీన్ని ఆమె సత్యాగ్రహంగా అభివర్ణించారు.
ధర్నాలో కూర్చున్న మమతా బెనర్జీ, తృణమూల్ నేతలు
భాజపా సీబీఐని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంపై దాడులకు పురిగొల్పుతోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే సత్యాగ్రహం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
Last Updated : Feb 3, 2019, 10:20 PM IST