'ఉద్యోగాలు లేని ఆర్థికవృద్ధి' అనే విమర్శలను ఖండించారు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ. భాజపా అధికారంలోకి వచ్చాక లక్షలాది ఉద్యోగాలను సృష్టించామని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సామాజిక, రాజకీయ ఆందోళనలు జరగకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు.
న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న కేంద్ర మంత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ బడ్జెట్ కాదని, ఇదొక రిపోర్టు కార్డులాంటిదని అన్నారు.
2017-18 సంబంధించి లీకైన అధికారిక నివేదికలో నిరుద్యోగ రేటు 45 గరిష్ఠానికి చేరిందని వెల్లడైంది. దీనిపై వివాదం కొనసాగుతున్నందున స్పందించారు జైట్లీ. నోట్ల రద్దు అంశంపైనా మాట్లాడారు.