కమిషనర్ ఇంటి వద్ద ఉద్రిక్తత కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చిట్‌ఫండ్ కుంభకోణంలో కమిషనర్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులను బలవంతంగా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
చిట్‌ఫండ్ కుంభకోణం కేసును పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ గతంలో దర్యాప్తు చేశారు. ఆ కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు మాయమయ్యాయి. దీనిపై సీబీఐ నోటీసులకు రాజీవ్‌కుమార్ స్పందించడంలేదు. దీంతో 'రోజ్‌వ్యాలీ', 'పోంజీ స్కామ్ కేసు'ల విషయమై కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారుల బృందం కమిషనర్ ఇంటికి వెళ్లింది.
"పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ విధులకు హాజరవుతున్నారు. జనవరి31న మాత్రమే సెలవులో ఉన్నారు. ఈ విషయంలో సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి వార్తలు ప్రచురించినా, కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా పరువునష్టం దావా వేస్తాం"- కోల్‌కతా పోలీసులు
రాజీవ్‌కుమార్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పశ్చిమ బంగ కేడర్‌కు చెందిన రాజీవ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ బంగ ఎన్నికల సమయంలో ముందస్తు ఏర్పాట్ల సమీక్షకు రాజీవ్హాజరుకాకపోవడం అప్పట్లో వివాదమైంది.