అసంఘటిత కార్మికుల కోసం కొత్త పింఛను పథకం ఏర్పాటుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఆరోగ్య పథకం కింద ఆయుష్మాన్ భారత్‌తో పాటు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలకు అదనంగా 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్' పేరుతో పింఛను పథకాన్ని ప్రకటించింది. నెలకు 15 వేలలోపు ఆదాయం ఉన్న కార్మికుల్ని అర్హులుగా ప్రకటించింది.
అసంఘటిత రంగంలో 29 ఏళ్ల వయసులో నెలకు రూ. 100తో చెల్లిస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత 3000 ఫించను అందుతుంది. 18 ఏళ్ల వయసులోనే ఇందులోకి ప్రవేశిస్తే నెలకు రూ. 55 చెల్లిస్తే చాలు. ఈ పథకం ద్వారా సుమారు 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లాభం చేకూరుతుంది. రూ. 500 కోట్ల నిధులతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు నిర్ణయం.
శ్రమయోగి మాన్‌ధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛను పథకం.
కార్మికులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించేందుకు నిర్ణయించాం. ఆరోగ్య పథకం కింద ఆయుష్మాన్ భారత్‌తో పాటు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్' పేరుతో కొత్త పింఛను పథకం. ఈ పథకం కింద నెలకు 15 వేల లోపు ఆదాయం ఉన్న వారు అర్హులు. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 పింఛను అందుతుంది.
అసంఘటిత కార్మికులు 29 ఏళ్ల వయసు నుంచి కేవలం నెలకు రూ. 100 చెల్లించాలి. 18 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు రూ. 55 చెల్లిస్తే చాలు. 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు. ఈ ఆర్థిక సంవత్సరమే రూ. 500 కోట్లతో దీనిని ప్రారంభించనున్నాం.
- పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి