ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

పోలీసులపై నేరస్థుల కాల్పులు..! - పోలీసులు

బిహార్​ ముజఫర్​పుర్​లో ఎదురుకాల్పులు జరిగాయి. జనసందోహం ఉన్న బస్​స్టాప్​లోనే కాల్పులు జరగటం గమనార్హం.

పోలీసులపై నేరస్థుల కాల్పులు..!

By

Published : Feb 2, 2019, 11:55 PM IST

attack on police
బిహార్​ ముజఫర్​పుర్​లోని బైరియా బస్​స్టాప్​లో నేరస్థులు-పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేరస్థుల్లో ఒకరైన కుందన్​ను హతమార్చారు పోలీసులు. పలువురు ప్రయాణీకులూ గాయాలపాలయ్యారు.

"బస్సు సిటీ బస్​స్టాప్​ చేరగానే ముగ్గురు గ్యాంగ్​స్టర్​లు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన పోలీస్​ అప్రమత్తం బృందం​ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు."
- పోలీసు అధికారి

నేరస్థులు ఉన్నారన్న పక్కా సమాచారంతో బస్​స్టాప్​కు చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నేరస్థుల్లో మిగిలిన ఇద్దరు తప్పించుకున్నారు. గాయాలతో బస్​స్టాప్​లోని ఒక బస్సులో దాక్కున్న కుందన్​ను మాత్రమే పట్టుకోగలిగామని అధికారులు తెలిపారు. పారిపోయిన నేరగాళ్లపై అరెస్ట్​ వారెంట్​ విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details