లండన్‌లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే దస్త్రంపై బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు అప్పగింతపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మాల్యా మరో 14 రోజుల గడువులోపు దీనిపై అప్పీలుకు వెళ్లొచ్చు.
మాల్యా అప్పగింతకు బ్రిటన్ పచ్చజెండా - బ్రిటన్ హోం
విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే దస్త్రంపై బ్రిటన్ సంతకం చేసింది.
విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగింత
ఇటీవల విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై విచారించిన లండన్ వెస్ట్‌మినిస్టర్ న్యాయస్థానం మాల్యాను భారత్‌కు అప్పగించాలని సూచించింది. జైలు గది పరిస్థితులపై చేసిన అప్పీలుపై విచారించిన న్యాయస్థానం... భారత్‌లో జైలుగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌కు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశాలతో బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.