ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

నల్లధనం వివరాల వెల్లడికి ఆర్థికశాఖ నిరాకరణ - సమాచారం హక్కు చట్టం

నల్లధనంపై రూపొందించిన నివేదికలను సమాచారం హక్కు చట్టం కింద వెల్లడించడం కుదరదని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. అది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.

నల్లధనం

By

Published : Feb 4, 2019, 3:34 PM IST

భారతీయులు దేశవిదేశాల్లో దాచుకున్న నల్లధనం విలువపై రూపొందించిన మూడు నివేదికలను బహిర్గతం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది. ఈ నివేదికలను పార్లమెంటరీ సంఘం​ పరిశీలిస్తున్నందున, వీటిని సమాచారం హక్కు చట్టం ద్వారా వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పింది.

ఈ మూడు నివేదికలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) ద్వారా వచ్చిన అభ్యర్థనపై ఆర్థిక మంత్రిత్వశాఖ ఈమేరకు స్పందించింది. ఆర్​టీఐ సెక్షన్​ 8(1)(సీ) ప్రకారం నివేదికలను బయటపెట్టడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.

నల్లధనంపై రూపొందించిన ఈ మూడు నివేదికలు 4 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి సమర్పించడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ నల్లధనం విలువ ఎంత అనేది అధికారికంగా తెలియరాలేదు.

770 బిలియన్​ డాలర్లుగా అంచనా

అమెరికాకు చెందిన గ్లోబల్​ ఫైనాన్షియల్​ ఇంటిగ్రిటీ (జీఎఫ్​ఐ) ప్రకారం నల్లధనం విలువ 2005-2014 మధ్య 770 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అదే సమయంలో భారత్​లో అక్రమ నగదు 165 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని ఆ సంస్థ తెలిపింది.

యూపీఏ ప్రభుత్వం 2011లో నల్లధనంపై అధ్యయనం చేసే బాధ్యతను నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పబ్లిక్​ ఫైనాన్స్ పాలసీ(ఎన్​ఐపీఈపీ), నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎకనామిక్​ రీసెర్చ్​ (ఎన్​సీఏఈఆర్​), నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫైనాన్సియల్​ మేనేజ్​మెంట్(ఎన్​ఐఎఫ్​ఎమ్​)కు అప్పగించింది.

ఈ సంస్థలు తమ నివేదికలను వరుసగా డిసెంబర్​ 30, 2013, జూలై 18, 2014, ఆగస్టు 21, 2014లో ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని లోక్​సభ సెక్రటేరియట్​కు సమర్పించిన తరువాత స్టాండింగ్​ కమిటీ ఆఫ్ ఫైనాన్స్ పరిశీలనకు పంపారని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details