ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

ఆరోగ్య భారత్​ @ బడ్జెట్ 2019 - budjet 2019

బడ్జెట్​లో ఆరోగ్యరంగానికి కేటాయింపులపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ఆరోగ్య రంగానికి బడ్జెట్​లో 61వేల కోట్లు కేటాయించారు.

ఆరోగ్య భారత్​

By

Published : Feb 2, 2019, 7:37 AM IST

ఆరోగ్య భారత్​
ఆయుష్మాన్ భారత్ స్ఫూర్తితో ఆరోగ్య రంగం ముందుకెళ్తుందని కేంద్ర మధ్యంతర బడ్జెట్​తో స్పష్టమవుతోంది. ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి 61,398 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్​ తో పోలిస్తే 16 శాతం ఎక్కువ. అంతకుముందు రెండు బడ్జెట్ల కన్నా ఇది అధికమే.

"ఆరోగ్య భారత్​పై ప్రభుత్వానికున్న దక్షత మధ్యంతర బడ్జెట్​ను చూస్తే తెలుస్తోంది. గ్రామాలను పట్టణాలతో కలిపే విధంగా ఉంది. గ్రామీణ,పట్టణ ప్రాంతంలో ఆరోగ్య మౌలిక వసతులలో సమతుల్యం పాటించేలా చూసుకోవాలి. ఆరోగ్య రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి "

- సంగీత రెడ్డి, జాయింట్​ ఎండీ, అపోలో హస్పిటల్స్ .

"2030 లక్ష్యాల్లో పది కీలక అంశాల్లో ఆరోగ్య భారత్​ను చేర్చడం శుభపరిణామం. 2019-20 మధ్యంతర బడ్జెట్​ సమతుల్యంగా ఉంది. ఆరోగ్య రంగానికి మంచి చేసే ఎన్నో విషయాలున్నాయి. ప్రభుత్వం ప్రాధాన్య రంగాల్లో ఆరోగ్య రంగాన్ని చేర్చే విషయంపై పునః పరిశీలించాలి"

- భారత ఆరోగ్యసేవ సమాఖ్య

ఆరోగ్య రంగంలో వైద్య పరికరాల తయారీ కేటాయింపులపై వివిధ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. వైద్య సేవల ఖర్చుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వాదనలు వినిపిస్తున్నాయి.

" ఈ బడ్జెట్​లో స్థానిక తయారీదారులకు మేలు చేసే ఎలాంటి పథకాలు పెట్టలేదు. వైద్య సేవల ఖర్చులను ప్రభుత్వం తగ్గించే చర్యలు తీసుకోవాలి"

- గణేశ్ సబత్ సీఈఓ, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details