national

ETV Bharat / snippets

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ వర్గీయులు - టీడీపీ కార్యకర్తలపై దాడి

ysrcp_followers_attacked_on_tdp_cadre_in_guntur
ysrcp_followers_attacked_on_tdp_cadre_in_guntur (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 9:54 AM IST

YSRCP Followers Attacked On TDP Cadre in Guntur District :గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం వర్గీయులపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేశారు. మంగళవారం రాత్రి మూకుమ్మడిగా వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి దిగడంతో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడులలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పికెట్ ఏర్పాటు చేశారు.

బాపట్ల జిల్లాలో తూర్పుపిన్నిబోయినవారిపాలెంలో వైఎస్సార్సీపీ మూకలు రెచ్చిపోయారు. టీడీపీ సానుభూతిపరులకు చెందిన గడ్డివాములకు నిప్పుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details