national

ETV Bharat / snippets

జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన - టీజీపీఎస్సీ ఆఫీస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 6:45 PM IST

PROTEST AT TGPSC OFFICE
PROTEST AT TGPSC OFFICE (ETV Bharat)

Unemployed Protest At TGPSC Office :రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందని సమాఖ్య అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. 6 నెలలైనా ఉద్యోగాల ఊసెత్తడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చినమాట ప్రకారం ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details