national

బ్రీత్‌ అనలైజర్‌ను ఎత్తుకెళ్లిన మందుబాబు - షాక్​లో పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 7:03 PM IST

Man Steals Breath Analyser Machine From Police
Man Steals Breath Analyser Machine From Police (ETV Bharat)

Man Steals Breath Analyser Machine From Police : బ్రీత్‌ అనలైజ్‌ టెస్ట్‌ చేస్తున్నప్పుడు దాన్నే ఎత్తుకుని పోయాడో ఓ మందుబాబు. ఈ ఘటన హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి బోయిన్‌పల్లిలోని పుల్లారెడ్డి ఇంటి వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. మహేందర్‌ అనే వ్యక్తి స్విఫ్ట్‌ కారులో బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్నాడు. తనిఖీలు చేపడుతున్నారని వాహనాన్ని అక్కడే నిలిపాడు.

ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ వచ్చి బ్రీత్‌ అనలైజర్ టెస్టు చేసే క్రమంలో అతని నుంచి దాన్ని లాక్కుని వాహనాన్ని వేగంగా నడుపుకుంటూ పరారయ్యాడు. దీంతో ఒక్కసారిగా షాకైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details