ETV Bharat / snippets

కంభంపాడు ఘటనపై చంద్రబాబు సీరియస్- ఎమ్మెల్యే కొలికపూడిని వివరణ కోరిన సీఎం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 6:07 PM IST

CM_Chandrababu_Serious_on_MLA_Kolikapudi
CM_Chandrababu_Serious_on_MLA_Kolikapudi (ETV Bharat)

CM Chandrababu Serious on MLA Kolikapudi: ఎన్టీఆర్‌ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి వివరణ కోరారు. కంభంపాడులో వైఎస్సార్సీపీ నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కొంత మేర కూల్చివేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేని పిలిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై వివరణ తీసుకున్నారు. కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించమని తాను కోరినా వారి నుంచి స్పందన లేనందుకే తాను వెళ్లాల్సి వచ్చిందని కొలికిపూడి వివరించారు. 2013లో చంద్రబాబు కాన్వాయ్​పై రాళ్ల దాడి, ఇటీవల ఎన్నికల్లో కేశినేని చిన్నిపై దాడి ఘటనను వివరించారు. చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం తప్ప, క్షేత్రస్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దని చంద్రబాబు కొలికిపూడికి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.