national

ETV Bharat / snippets

తెలంగాణలో జులై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు !

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 8:15 AM IST

WEATHER FORECAST IN TELANGANA
Rain Updates in Telangana (ETV Bharat)

Rain Updates in Telangana: తెలంగాణలో జులై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జులై 7న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జులై 8న కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కురుసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ ఈదురుగాలులతోకూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details