national

నాగార్జున యాదవ్ పిటిషన్​పై విచారణ - రెండు వారాలకు వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 9:15 AM IST

HC on Nagarjuna Yadav Petition
HC on Nagarjuna Yadav Petition (ETV Bharat)

Nagarjuna Yadav Petition: వైఎస్సార్సీపీ నేత నాగార్జునయాదవ్‌పై నమోదు చేసిన కేసులో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహితలోని సెక్షన్‌ 35(3) (సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ) ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ కోరామని కుప్పం పోలీసులు హైకోర్టుకు నివేదించారు. చట్ట నిబంధనలు, అర్నెష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంటూ విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.

ఫిర్యాదుదారుడు వరుణ్‌కుమార్‌కు నోటీసు జారీచేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలని నాగార్జునయాదవ్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి పోలీసులు పిటిషనర్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆ వాదనను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details