national

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 7:27 PM IST

ETV Bharat / snippets

వృద్దురాలు ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ - తప్పిన ప్రాణనష్టం

Gas Cylinder Blast
Gas Cylinder Blast In Kamareddy (ETV Bharat)

GasCylinder Blast In Kamareddy : ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. వృద్ధురాలు సత్తవ్వ ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమయింది. ఇంటి గోడలకు పగుళ్లు వచ్చాయి.

వృద్ధురాలు భయంతో పరుగులు తీస్తూ బయటకు వెళ్లింది. ప్రమాదం సంభవించినప్పుడు ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉన్నారు. భారీ శబ్దం రావడంతో కాలనీవాసులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లుగా స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details