national

శ్రీశైలం ఆలయ క్యూలైన్​లో అపచారం - మద్యం సేవించిన సిబ్బందిపై భక్తుల దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:45 AM IST

srisailam_temple
srisailam_temple (ETV Bharat)

Devotees Attacked on Temple Staff in Srisailam : శ్రీశైలం ఆలయ క్యూలైన్లలో అపచారం జరిగింది. క్యూలైన్ సిబ్బంది పలువురు నిన్న రాత్రి మద్యం సేవించి విధుల్లో పాల్గొన్నారు. మద్యం మత్తులో ఆలయానికి రావడమే గాకుండా ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారంటూ భక్తులు ఆగ్రహించారు. మద్యం సేవించిన సిబ్బందిలో ఒకరిని పట్టుకున్న భక్తులు చితకబాదారు. అనంతరం ఏఈవో స్వాములును క్యూలైన్‌కు పిలిపించి వాస్తవ పరిస్థితిని భక్తులు వివరించారు. శ్రీశైలం ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మద్యం సేవించి వచ్చిన ఉద్యోగిపై ఈవో పెద్దిరాజు చర్యలు తీసుకున్నారు. క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణ అధికారి స్వాములు, క్యూలైన్ల పర్యవేక్షకులు గంజి రవిని సస్పెండ్‌ చేశారు. అలాగే శ్రీశైలం ఏఈవో, సీఎస్‌వోగా పని చేస్తున్న మరో పర్యవేక్షకుడికి మెమో జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details