national

రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ స్టేషన్ - ఎన్నికల హామీని పూర్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 8:45 PM IST

Deputy CM Bhatti Vikramarka
Deputy CM Bhatti on Ramagundam Thermal Power (ETV Bharat)

Deputy CM Bhatti on Ramagundam Thermal Power : రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పిన ఎన్నికల హామీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న హామీని పూర్తి చేయాలని ఉమ్మడి ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.

వారి అప్పీల్​ పట్ల డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మకమైన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్​ను తిరిగి నిర్మిస్తామన్నారు. పిట్ హెడ్ ప్లాంటును సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని మంత్రి శ్రీధర్ బాబుకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details