national

రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: పవన్ కల్యాణ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

REVIEW OF ROAD CONSTRUCTION
DEPUTY CHIEF MINISTER PAWAN KALYAN (ETV Bharat)

Deputy CM Pawan Kalyan Review AIIB Project Works:రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు తరచూ వరదలకు కొట్టుకుపోకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏఐఐబీ (ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు) సాయంతో రోడ్డు పనులపై బ్యాంకు అధికారులు పవన్‌ కర్కి, తౌసిక్‌ రెహ్మాన్‌తోపాటు ఇంజినీరింగ్‌ అధికారులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రహదారులు నిర్మించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉడుముడిలంకలలో పర్యటించి అక్కడ రోడ్డుతో పాటు వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణానికి తమవంతు సాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details