నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్థరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు.
మట్టిమిద్దె కూలి నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం ఆవేదన - 10 లక్షల సాయం ప్రకటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 6:16 PM IST
వర్షాలకు నాని మిద్దె కూలిపోయింది. దీంతో నిద్రలోనే గురుశేఖర్తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టువులు చనిపోవడంతో ప్రసన్న అనాథ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న సీఎం, ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తరపున 10 లక్షల సాయం ప్రకటించారు.