Ministerial Sub Committee on CRDA Lands :సీఆర్డీఏ పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్‌లు సభ్యులుగా ఉన్నారు.
సీఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపుల పరిశీలన - ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2024, 7:22 PM IST
కన్వీనర్‌గా పురపాలక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉంటారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్షించనున్నారు. కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచనలు చేయనుంది. అభ్యర్థనల పరిశీలన, వివిధ రంగాలలోని ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది. వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది.