జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు - త్వరలో తేదీల ఖరారు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 9:31 PM IST
![జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు - త్వరలో తేదీల ఖరారు AP Assembly Sessions in July](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2024/1200-675-21786844-thumbnail-16x9-ap-assembly-sessions-2024.jpg)
AP Assembly Sessions in July :ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం వీటిని నిర్వహించనున్నారు. త్వరలో శాససనభ సమావేశాల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలఖారుతో ముగియనుంది. ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పద్దును రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లోనే ల్యాండ్ టైటిల్ యాక్టు రిపీల్ బిల్లు సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.