గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2024, 9:26 PM IST
ACB Petition For Venkata Reddy Custody: గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. వెంకటరెడ్డిని వారంపాటు ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఇరువర్గాల తరఫున న్యాయమూర్తి వాదనలు విన్నారు. కస్టడీ పిటిషన్‌పై మంగళవారం తీర్పు ఇవ్వనున్నారు. కాగా గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన అధికారులు, ఇప్పటికే ఆయనను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపట్టడంతో, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనని విజయవాడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ1గా వెంటరెడ్డి సహా ఏడుగురిపై FIR నమోదు అయ్యింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2 వేల 5 వందల 66 కోట్ల రూపాయలు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.