Yashasvi Jaiswal 2024:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో జైశ్వాల్ ఈ మైలురాయి అందుకున్నాడు. కాగా, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ (2024)లో జైశ్వాల్ ఇప్పటివరకు 63.93 సగటుతో 1023 పరుగుల బాదాడు. అందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జైశ్వాల్ ఈ మొత్తం పరుగులు టెస్టు (740), టీ20 (283)ల్లోనే సాధించడం విశేషం. అతడు ఇప్పటివరకు వన్డే అరంగేట్రం చేయలేదు.
యశస్వి అరుదైన ఘనత- తొలి బ్యాటర్‌గా రికార్డ్
Yashasvi Jaiswal 2024 (Source: Associated Press)
Published : Jul 29, 2024, 3:45 PM IST
ఇక శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండీస్ (888 పరుగులు), అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీమ్ జర్దాన్ (844 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.