national

ETV Bharat / snippets

ఇంట్రెస్టింగ్​గా వరల్డ్​కప్ సెమీస్ రేస్- ​భారత్​కు ఛాన్స్ ఎంతంటే?

World Cup Semis Race
World Cup Semis Race (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 12:12 PM IST

T20 World Cup 2024:2024 టీ20 వరల్డ్​కప్​ సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్- 8లో నాలుగు మ్యాచ్​లే మిగిలి ఉన్నా, ఒక్క జట్టుకు కూడా సెమీస్ బెర్తు ఖరారు కాలేదు. గ్రూప్- 1నుంచి భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​ రేస్​లో ఉండగా, గ్రూప్- 2నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్​ పోటీలో ఉన్నాయి. మిగిలిన మ్యాచ్​లు ఇంగ్లాండ్- అమెరికా, సౌతాఫ్రితా- వెస్టిండీస్, గ్రూప్- 1లో భారత్- ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్- అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్నాయి.

గ్రూప్- 1లో భారత్​ సెమీస్ చేరేందుకు భారత్​కు దాదాపు 95శాతం ఛాన్స్ ఉంది.​ అటు సౌతాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ రెండు జట్లు తమతమ ఆఖరి మ్యాచ్​లో నెగ్గితే సెమీస్​ చేరుకుంటాయి. ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్​రన్​రేట్ కీలకంగా మారుతుంది. మిగిలిన రెండు బెర్త్​ల కోసం 4జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది.

ABOUT THE AUTHOR

...view details