India VS Zimbabwe T20 Team Squad : జులై 6 నుంచి జులై 14 వరకు జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది బీసీసీఐ. తొలి రెండు మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించింది. ఎందుకంటే హరికేన్ తుపాను కారణంగా వరల్డ్‌కప్ 2024 టీమ్ఇండియా ప్లేయర్స్ ఇంకా వెస్టిండీస్‌లోనే ఉంది. దీంతో శాంసన్, దూబే, జైశ్వాల్ అక్కడే ఉండిపోయారు. అందుకే ఐపీఎల్లో అదరగొట్టిన ఈ ముగ్గురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా, ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
జింబాబ్వే పర్యటనలో మార్పులు - ఐపీఎల్లో అదరగొట్టిన ప్లేయర్స్‌కు ఛాన్స్
Published : Jul 2, 2024, 4:18 PM IST
India VS Zimbabwe T20 Team Squad (source The Associated Press)
టీమ్ఇండియా జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్‌గైక్వాడ్, అభిషేక్‌శర్మ, రింకూసింగ్, ధ్రువ్‌జురెల్, రియాన్పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవిబిష్ణోయ్, అవేశ్‌ఖాన్, ఖలీల్‌అహ్మద్, ముకేశ్‌కుమార్, తుషార్ దేశ్ పాండే, సాయిసుదర్శన్, జితేశ్శర్మ, హర్షిత్‌రాణా.