national

శ్రీలంక మాజీ క్రికెటర్‌ మృతి - భార్యాపిల్లల ఎదుటే దారుణ హత్య

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 1:06 PM IST

Srilanka Former Cricketer Murdered
Srilanka Former Cricketer Murdered (Associated Press, Getty Images)

Srilanka Former Cricketer Murdered :శ్రీలంక జట్టు మాజీ క్రికెటర్‌ ధామిక నిరోషన హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి తన నివాసంలో భార్యా పిల్లల ఎదుటే ధామికను దారుణంగా కాల్చి చంపాడు. ఆయన మృతి పట్ల క్రీడాభిమానులు, పలువురు శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఏమైందంటే?
గాలె జిల్లాలోని అంబాలన్‌గోడాలో కొన్నేళ్లుగా ధామిక ఫ్యామిలీ నివసిస్తోంది. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి దాడి చేశాడు. కుటుంబం కళ్ల ముందే ధామికను తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ధామిక అక్కడికక్కడే మరణించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపడుతున్నారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details