national

ETV Bharat / snippets

'అలాంటిదేమైనా ఉంటే నేను తప్పకుండా అనౌన్స్​ చేస్తాను' - పెళ్లి రూమర్స్​పై క్లారిటీ

Shubman Gill Marriage Rumors
Shubman Gill Marriage Rumors (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 1:15 PM IST

Shubman Gill Marriage :టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ శుభ్​మన్​ గిల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు హల్​చల్ చేశాయి. బాలీవుడ్ సీరియల్ నటి రిధిమా పండిట్​ను గిల్ వివాహం చేసుకోనున్నాడంటూ నెటింట ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్​పై నటి రిధిమా స్పందించింది.

"నేను ఉదయానే లేచి చూడగానే నాకు జర్నలిస్టుల నుంచి పలు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్లందరూ నా పెళ్లి గురించే అడిగారు. నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఒక వేళ నా లైఫ్​లో అలాంటి ముఖ్యమైనది ఏదైనా జరిగితే నేను కచ్చితంగా అనౌన్స్​ చేస్తాను. ఈ రూమర్​లో ఎటువంటి నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

ABOUT THE AUTHOR

...view details