Rahul Dravid Team India :టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలె సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్పే తనకు చివరి టోర్నమెంట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఈ టోర్నీనే నాకు చివరిది - రాహుల్ ద్రవిడ్
Published : Jun 4, 2024, 6:50 AM IST
![ఈ టోర్నీనే నాకు చివరిది - రాహుల్ ద్రవిడ్ Rahul Dravid Team India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-06-2024/1200-675-21629559-thumbnail-16x9-dravid.jpg)
Rahul Dravid Team India (Getty Images)
"భారత్ తరఫున కోచ్‌గా కీలక బాధ్యతలు చేపట్టిన అన్ని టోర్నీలూ నాకు ఎంతో ముఖ్యమైనవే. టీ20 ప్రపంచకప్ కూడా అలాంటిదే. ఈ టోర్నీతోనే నేను చివరగా కోచ్‌గా కనిపిస్తాను. ఈ పదవిని నేను ఎంతగానో ఆస్వాదించాను. మోస్ట్ ట్యాలెంటడ్ ప్లేయర్స్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని ద్రవిడ్ తెలిపాడు.