Jos Buttler On Rohit Sharma:టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అన్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ రెండో సెమీఫైనల్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బట్లర్, రోహిత్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'రోహిత్ కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతుంది. గ్రౌండ్లో రోహిత్ చాలా చురుగ్గా ఉంటాడు. బ్యాటింగ్, వ్యూహాలతో జట్టును సమర్థంగా నడిపిస్తాడు. అతడి పుల్ షాట్స్ ఎంజాయ్ చేస్తా' అని బట్లర్ అన్నాడు.
రోహిత్ స్మార్ట్ కెప్టెనే- మేము కూడా అన్నింటికి రెడీ: బట్లర్
Published : Jun 27, 2024, 4:13 PM IST
Jos Buttler On Rohit Sharma (Source: Associated Press)
'ఈ మ్యాచ్‌లో భారత్ అగ్రెసివ్‌గా ఆడడానికి ట్రై చేస్తుంది. అందులో వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టీమ్ఇండియా అగ్రెషన్ ఎదుర్కోడానికి మేం రెడీగా ఉన్నాం. మేము కూడా అంతే అగ్రెసివ్‌గా ఆడతాం' అని సెమీఫైనల్ మ్యాచ్‌ను ఉద్దేశించి బట్లర్ మాట్లాడాడు. ఇక భారత్- ఇంగ్లాండ్ మధ్య గురువారం సెమీఫైనల్ ఫైట్ ఉండనుంది. ఇందులో నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాలని ఇరుజట్ల భావిస్తున్నాయి.