Ex CM KCR Meet with Zilla Parishad Chairmans :మూడు రోజుల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశాలను పునఃప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్లు హాజరయ్యారు. అందులో భాగంగానే 17 జిల్లాల ఛైర్మన్లు హాజరుకాగా, మరో నలుగురు గైర్హాజరు కావటం గమనార్హం.
ఏడు నెలల పాలనకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : కేసీఆర్
BRS Chief KCR Athmiya Samavesam (ETV Bharat)
Published : Jul 2, 2024, 7:11 PM IST
ఈ భేటీలో ప్రధానంగా ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, రాజకీయ సమీకరణాలపై కేసీఆర్ చర్చించారు. ఏడు నెలల పాలనకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఉద్ఘాటించారు. రాబోయే రోజులు తమవేనని గులాబీ బాస్ అన్నారు. అదేవిధంగా ధైర్యంగా ఉండాలని జడ్పీ ఛైర్మన్లకు కేసీఆర్ సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్తో కలిసి ఫొటోలు దిగారు.