Varun Dhawan Baby :బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన సతీమణి నటాషా దాలాల్ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ తాజాగా మీడియాకు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ దంపతులకు కంగ్రాజ్యూలేషన్స్ తెలుపుతున్నారు.
తండ్రిగా బాలీవుడ్ హీరోకు ప్రమోషన్- నటాషా ఫుల్ హ్యాపీ!
Published : Jun 4, 2024, 7:16 AM IST
Varun Dhawan Baby (Getty Images)
ఇక వరుణ్ ధావన్ ప్రస్తుతం 'బేబీ జాన్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నారు. ఇది కోలీవుడ్ హిట్ మూవీ తెరికి రీమేక్ అని సమాచారం. ఇది కాకూండ అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్లోనూ ఈ స్టార్ హీరీ కీలక పాత్ర పోషించాడు.