Prabhas Kalki 2898AD Release Trailer : ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం కల్కి 2898 ఏడీ. ఇప్పుడు ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే అంతా కల్కి ఫీవరే కనిపిస్తోంది. మూవీటీమ్ కూడా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కో అప్డేట్ను రిలీజ్ చేస్తూ హైప్‌ను పెంచేస్తోంది. తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓక్కో యాక్షన్ సీన్, డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
'కల్కి' రిలీజ్ ట్రైలర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్!
Published : Jun 22, 2024, 1:28 PM IST
!['కల్కి' రిలీజ్ ట్రైలర్‌కు సెన్సేషనల్ రెస్పాన్స్! Kalki 2898AD Release Trailer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/1200-675-21769389-thumbnail-16x9-prabhas-kalki.jpg)
Kalki 2898AD Release Trailer (ETV Bharat)
దీంతో ఇప్పుడా రిలీజ్ ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంటోంది. పలు భాషల్లో కలిపి ఈ ప్రచార చిత్రం ఏకంగా 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకుంది. ఇదంతా ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే జరిగిపోవడం విశేషం. కాగా, ఈ చిత్రంలో దీపిక, దిశాపటాని, కమల్‌హాసన్, అమితాబ్ తదితరులు నటించారు. జూన్ 27న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.