national

RBIలో 94 ఆఫీసర్ పోస్టులు - వేలల్లో జీతం - దరఖాస్తుకు కొద్ది రోజులే ఛాన్స్​!

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 10:15 AM IST

RBI Recruitment 2024
RBI (ANI)

RBI Recruitment 2024 :ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు 94 ఆఫీసర్​ (గ్రేడ్​-బి) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్​ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి, అర్హులైన వారిని ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఆఫీసర్ గ్రేడ్‌ బి (డీఆర్‌) ఉద్యోగాల వివరాలు

  • జనరల్ - 66
  • డీఈపీఆర్‌ - 21
  • డీఎస్‌ఐఎం - 07
  • మొత్తం పోస్టుల సంఖ్య : 94

అర్హతలు : డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు, పని అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,200 - రూ.99,750 వరకు జీతం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 ఆగస్టు 16లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details