ఇండియాలోకి మెటా AI - వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఏం అడిగినా క్షణాల్లో రిప్లై
Published : Jun 24, 2024, 12:55 PM IST
Meta AI In India : మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ 'మెటా ఏఐ' భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ సహా meta.AI పోర్టల్‌లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మెటా సంస్థ వెల్లడించింది. యూజర్లు ఇకపై మెటా ఏఐని సామాజిక మాధ్యమ యాప్‌లలో చాటింగ్, కంటెంట్ సృష్టించడం సహా ఆయా అంశాలపై లోతుగా శోధించేందుకు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రముఖ ఏఐ అసిస్టెంట్లలో మెటా ఏఐ కూడా ఒకటి. లామా3 ఎల్‌ఎల్‌ఎం ఆధారంగా దీన్ని రూపొందారు. మెటా ఏఐ సాయంతో వాట్సప్ గ్రూప్ చాట్‌లో రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఫేస్బుక్లో ఏదైనా ఓ పోస్ట్‌పై లోతైన సమాచారం తెలుసుకునేందుకూ వాడుకోవచ్చు. పర్యటక స్థలం చిత్రం ఎఫ్‌బీలో కనిపించినప్పుడు అక్కడికి వెళ్లడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇలా యూజర్లకు పలు రకాలుగా ఏఐ అసిస్టెంట్ అండగా ఉంటుంది.