national

ETV Bharat / snippets

'అలా చేయకుంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం'- రైల్వే శాఖ వార్నింగ్!

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Railways On Wrong Train Data
Railways On Wrong Train Data (ETV Bharat)

Railways On Wrong Train Data :రైళ్ల రాకపోకలకు సంబంధించి ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేకపోవడం వంటివి జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ మేరకు దేశంలోని మెుత్తం 17 జోన్లకు రైల్వే బోర్డు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అన్ని రైల్వేస్టేషన్‌లో రైళ్ల స్థితిగతులపై ప్రదర్శించే బోర్డులు విశ్వసనీయతతో ఏకీకృత విధానంలో ఉండాలని సూచించింది. నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వయిరీ సిస్టం- NTES వెబ్‌సైట్‌లోనూ రైళ్ల రాకపోకలు, కోచ్‌ల పరిస్థితులపై కచ్చితమైన సమాచారం ఉండాలని బోర్డు తెలిపింది. ఫ్లాట్‌ఫాంలపై ఆయా రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసే సూచిక బోర్డులో రైళ్ల పేర్లు, నంబర్లు, నడుస్తున్న స్థితి ఉండాలని బోర్డు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details