national

వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్- మెజార్టీ ఎంతంటే?

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 5:20 PM IST

Lok Sabha Election Results 2024
Lok Sabha Election Results 2024 (ANI)

Lok Sabha Election Results 2024 PM Modi : లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ ఢంకా మోగించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో హ్యట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్​ రాయ్​పై 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, మోదీపై అజయ్​ రాయ్ పోటీ చేయడం వరుసగా మూడోసారి. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా, 56 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్‌ రాయ్‌కు కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్‌ ఆద్మీ తరఫున అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక, 2019 ఎన్నికల్లో ప్రధానికి 63 శాతం ఓట్లు రాగా, అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి.

ABOUT THE AUTHOR

...view details