ETV Bharat / snippets

ఆగస్టులో 'నీట్‌-పీజీ'ఎగ్జామ్- పరీక్షకు 2గంటల ముందే ప్రశ్నపత్రం తయారీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 8:23 AM IST

NEET PG Exam 2024
NEET PG Exam 2024 (ETV bharat)

NEET PG Exam 2024 Date : నీట్‌-పీజీ 2024 పరీక్షను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒకరోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఈ నెల 2న ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. నీట్‌-పీజీ ఏర్పాట్లపై కేంద్ర హోంశాంఖ సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు నిర్వహించింది. మరోపక్క నీట్‌ యూజీ పేపర్‌ లీకేజ్‌ వివాదం నేపథ్యంలో నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో నిర్వహించబోయే నీట్‌-పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.