ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాప్తాడులో 'సిద్ధం' - ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకుల మీటింగ్​ - YSR Party Meeting Satyasai District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 5:42 PM IST

YSRCP Leaders Party Meeting at Ganlapenta MPDO Office: శ్రీ సత్య సాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీఓ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈనెల 18న రాప్తాడులో జరగనున్న సిద్ధం కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. వైసీపీ సమన్వయకర్త మక్బూల్ అహమ్మద్ తో పాటు గాండ్లపెంట మండల అధ్యక్షుడు, పార్టీ ముఖ్యనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి వివిధ ప్రాంతాల్లో నుంచి పార్టీ అభిమానులు వస్తారని, వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

పని దినంలో మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో సమావేశానికి అధికారులు ఎలా అనుతించారనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించకుండా నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. వైసీపీ నాయకులు అధికారులనే కాదు, వారి కార్యాలయాలను కూడా తమకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details