ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నిస్సిగ్గుగా వ్యవహరించిన పోలీసులు- ఇసుక మైనింగ్ అడ్డుకున్న గ్రామస్థులపై జులుం - Illegal Sand Mining

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 1:09 PM IST

Illegal Sand Mining in NTR District: పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు యథేచ్చగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను తెలుగుదేశం నాయకులు(TDP Leaders), కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు(YSRCP Leadrs) ప్రైవేటు సైన్యంతో వచ్చి తెలుగుదేశం కార్యకర్తలతో వాగ్వాాదానికి దిగారు. ఇసుక లారీలను తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రవాణాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అడ్డుకునేందుకు వచ్చిన తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details